రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు..!

ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో ఆర్ఆర్ఆర్ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. 1920ల కాలం సమయంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీం, ఇద్దరి జీవితంలో జరిగిన యదార్ధ ఘటనలకు కొంత కల్పితాన్ని జోడించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. జనవరి 8 న RRR సినిమాను రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే.

తాజాగా ఇంటర్వ్యూలో రాజమౌళి షాకింగ్ నిజాలు చెప్పారు. లాక్ డౌన్ కి ముందే RRR షూటింగ్ 80 శాతం పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం తమ టీమ్ కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని తెలిపారు. ఇక RRR తర్వాత తన తదుపరి సినిమాపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ‘డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక సినిమా .. కేఎల్ నారాయణ నిర్మాతగా ఒక సినిమా చేయాలని నేను నిర్ణయించుకున్నాను.

ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను డీవీవీ దానయ్య నిర్మాణంలోనే చేస్తున్నాను. ఆ తరువాత సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో వుంటుంది. ఆ సినిమా ప్రభాస్ తో కాదు .. మహేశ్ బాబుతో ఉంటుంది. కేఎల్ నారాయణ నిర్మాణంలో మహేశ్ బాబు హీరోగా ఒక సినిమా చేస్తానని చాలా కాలంగా చెబుతూ వస్తున్నాను. ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత ఈ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది” అని ఆయన చెప్పుకొచ్చారు.