జూనియర్ ఎన్టీఆర్‌ను పోర్న్ స్టార్‌తో పోల్చిన వర్మ..

రామ్ గోపాల్ వర్మ అంతే.. ఎప్పుడెలా ఉంటాడో.. ఏం చేస్తాడో ఎవరికీ అర్థం కాడు. ఆయన పొగిడినా కూడా తిట్టినట్లే ఉంటుంది. కొందరి మాటతీరు అలాగే ఉంటుంది. అందులో వర్మ నెంబర్ వన్.. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌పై ఈయన చేసిన కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. తారక్ పుట్టిన రోజు కానుకగా ఆయన జిమ్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ సిక్స్ ప్యాక్ ఫోటో విడుదల చేసాడు. విడుదలైన కొన్ని క్షణాల్లోనే అభిమానులు దీన్ని ఓ రేంజ్‌లో వైరల్ చేస్తున్నారు. జూనియర్ సిక్స్ ప్యాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ వాంటెడ్ ఫోటో అయిపోయింది. దీనిపై ఇప్పుడు తన మార్క్ కామెంట్ చేసాడు వర్మ.

అందులో సిక్స్ ప్యాక్‌తో ఉన్న ఎన్టీఆర్‌ను ఏకంగా పోర్న్ స్టార్ మియా మాల్కోవాతో పోల్చేసాడు వర్మ. తాజాగా ఈమెతో క్లైమాక్స్ అనే సినిమా చేసాడు వర్మ. ఇంకా అదే మత్తులో ఉన్నాడు. అందుకే మియా మాల్కోవా తర్వాత తాను చూసిన బెస్ట్ బాడీ జూనియర్ ఎన్టీఆర్‌దే అంటూ ట్వీట్ చేసాడు ఈ దర్శకుడు. ఇది ప్రశంస అనుకోవాలో.. సెటైర్ అనుకోవాలో అర్థం కావడం లేదు అభిమానులకు. ఏదేమైనా కూడా ఆర్జీవీ కామెంట్ మాత్రం ఫోటోతో పాటే వైరల్ అవుతుందిప్పుడు.