ఆమె అలా ఎలా పడింది… బుర్రలు బద్దలు కొట్టుకుంటున్న నెటిజన్లు… వైరల్ వీడియో

ఒక్కోసారి మనం చూసేదాన్ని మన కళ్లతో మనమే నమ్మలేం. ఇది అలాంటిదే. ఓ మహిళ… రోప్ స్వింగ్ నుంచి… జారి నీటిలో పడింది. ఆమె మామూలుగా నీటిలో పడిపోయి ఉంటే… ఎవరూ ఈ వీడియోని పట్టించుకునే వారు కాదేమో. కానీ… ఆమె నీటిలో పడే ముందు… ఓసారి పైకి లేచినట్లుగా లేచి పడింది. అలా ఎలా జరిగిందో నెటిజన్లకు అర్థం కావట్లేదు. వీడియోని మళ్లీ మళ్లీ చూసి… అరే… ఇలా జరగకూడదే అని అనుకుంటున్నారు. ఇలా మళ్లీ మళ్లీ చూస్తున్నారు కాబట్టే… ఈ వీడియోకి ఆరు రోజుల్లో 1.5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇంకా చాలా మంది చూస్తూనే ఉన్నారు.

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ మైకా షాయ్… ఈ వీడియోని మే 19న పోస్ట్ చేశారు. “2020 హిట్ మీ హార్డ్ లైక్… హ్యాపీ మండే ఫ్రెండ్స్… నాకు తెలిసి… నా సోదరి మిమ్మల్నందర్నీ ఈ వీడియోతో నవ్విస్తుందని అనుకుంటున్నారు. మళ్లీ మళ్లీ” అని క్యాప్షన్ పెట్టారు. అప్పటి నుంచి నిజంగానే అంతా నవ్వుతూ, ఆశ్చర్యపోతూ… వీడియోని షేర్ చేసుకుంటున్నారు.