బర్త్‌డే పార్టీలో అత్యుత్సాహం… కిటికీ లోంచీ దూకి… వైరల్ వీడియో…

బర్త్‌డే అనేది… ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక. కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరి సమక్షంలో కేక్ కట చేసి… అందరికీ తినిపించి… ఆ మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుంటాయి. కొంతమంది బర్త్ డే వేడుకల్లో ఎక్స్‌ట్రాలు చేస్తుంటారు. ఈ భూమిపై తాము మాత్రమే పుట్టిన రోజు జరుపుకుంటున్నట్లు బిల్డప్ ఇస్తారు. వచ్చిన ప్రెండ్స్ ముందు లేనిపోని కటింగ్స్ ఇస్తారు. ఈ బర్త్‌డే పార్టీలో అదే జరిగింది. రష్యా బ్యాంకర్ దిమిత్రీ ప్రిగొరోడోవ్… మాస్కోలో 30వ బర్త్ డే జరుపుకుంటున్నాడు. 30వ ఏడాది చాలా స్పెషల్ గా ఉండాలని ఓ కాటేజీ రెంట్‌కి తీసుకొని ప్రత్యేక పార్టీ ఏర్పాట్లు చేశాడు. అందర్నీ పిలిచాడు. ఫ్రెండ్స్ వచ్చి విషెస్ చెప్పారు. వాళ్ల కోసం మొదటి అంతస్థులో డ్రింక్స్ సెట్ చేశాడు. అందరూ తలో గ్లాసూ పుట్టుకున్నారు. నువ్వు అంత, ఇంత అని మెచ్చుకున్నారు. అయినా అవి అతనికి చాలా లేదు. ఇంకా ఏదైనా చేసి… అందరికంటే తాను డిఫరెంట్ అనిపించుకోవాలనుకున్నాడు.

అందరూ కేక్ తిని మద్యం తాగాక… ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వెళ్దాం అనుకున్నారు. వెంటనే దిమిత్రీకి ఓ ఐడియా వచ్చింది. పూల్‌కా… మీరు అలా మెట్లు దికి కిందకు వచ్చేయండి. నేను మాత్రం అలా రాను. ఇలా వస్తా… అంటూ… పై అంతస్థులోని కిటికీ నుంచీ స్విమ్మింగ్ పూల్ లోకి దూకాడు. ఐతే… దూకేటప్పుడు సరిగా దూకలేదు. దాంతో… స్విమ్మింగ్ పూల్ ముందు ఉండే గ్లాస్‌ ప్యానెల్‌పై పడ్డాడు. అది పగిలి… ఆ తర్వాత నీటిలో పడ్డాడు. మొత్తం తేడా కొట్టింది. ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది.