‘నిన్నే పెళ్లాడతా’ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు..

అవును.. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం పాత టైటిల్స్ తెగ వాడేస్తున్నారు ఈ తరం హీరోలు. ఈ ఏడాది ఇప్పటికే ఖైదీ, గ్యాంగ్ లీడర్ లాంటి టైటిల్స్ వచ్చాయి. ఇక ఇప్పుడు నిన్నే పెళ్లాడతా అనే సినిమా కూడా వచ్చేస్తుంది. నాగార్జున కెరీర్లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమా టైటిల్ ఇప్పుడు ఓ హీరోయిన్ తమ్ముడు వాడేసుకుంటున్నాడు. అతడే రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్. ఈయన హీరోగా వచ్చేస్తున్నాడిప్పుడు. సినిమా కూడా సిద్ధం అయిపోయింది.

ఇండ‌స్ట్రీ అంటేనే వార‌స‌త్వానికి పెద్ద పీట వేస్తారు. వాళ్ల‌కు హిట్లు వ‌చ్చినా ఫ్లాప్ వ‌చ్చినా కూడా వెన‌క స‌పోర్ట్ చేస్తుంటారు. నిల‌బ‌డేవ‌ర‌కు దండ‌యాత్ర చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ర‌కుల్ ప్రీత్ సింగ్ త‌మ్ముడు కూడా హీరో అవుతున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు హీరోల కుటుంబం నుంచి వార‌సులు రావ‌డం చూసాం కానీ ఇప్పుడు హీరోయిన్ల కుటుంబాల నుంచి కూడా దండ‌యాత్ర మొద‌ల‌వుతుంది. ఇప్పుడు ర‌కుల్ త‌న త‌మ్మున్ని హీరోగా ప‌రిచ‌యం చేస్తుంది. ఈమె సోదరుడు అమన్ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

అమన్ సినిమాల్లోకి వ‌స్తున్నాడంటూ కొన్ని రోజుల నుంచి వార్త‌లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇదే నిజం అయింది. ఈయ‌న తొలి సినిమాకు నిన్నే పెళ్లాడతా అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఫస్ట్ లుక్ కూడా నాగార్జున విడుదల చేసాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా పూర్తి అయిపోయిందని.. పోస్ట ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పారు దర్శక నిర్మాతలు. డిజిటల్ ప్లాట్ ఫామ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అమన్ సరసన ఈ చిత్రంలో సిద్ధిక హీరోయిన్‌గా నటిస్తుంది. వైకుంఠ బోను దర్శకుడు. ఈశ్వరి ఆర్ట్స్ పతాకంపై బొలినేని రమ్య, వెలుగోడు శ్రీధర్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి నాగార్జున టైటిల్‌తో రకుల్ తమ్ముడు ఏం చేస్తాడో చూడాలిక.