మీకో దండం.. నా వల్ల కాదు.. ట్విట్టర్‌కు బాలీవుడ్ హీరోయిన్ గుడ్ బై..

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో ఏదేదో జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా స్టార్ కిడ్స్‌పై మండి పడుతున్నారు అభిమానులు. ముఖ్యంగా సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి.. ఎలాంటి టాలెంట్ లేకుండా జనాలపై రుద్దుతున్నారంటూ కొందరు హీరో హీరోయిన్లపై ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అలియా భట్, కరణ్ జోహార్, సల్మాన్ లాంటి స్టార్స్‌కు కూడా ఈ సెగ తప్పడం లేదు. వాళ్ల సోషల్ మీడియా ఫాలోయర్స్ రోజరోజుకీ పడిపోతున్నారు. ఈ క్రమంలోనే సోనాక్షి సిన్హా కీలక నిర్ణయం తీసుకుంది.

ఈమె ఇకపై ట్విటర్‌‌లో కనిపించదు.. ఎందుకంటే మనఃశాంతిని కాపాడు​కోవడానికి.. నెగిటివిటికి దూరంగా ఉండటానికి ట్విటర్‌ అకౌంట్‌ను డియాక్టివేట్‌ చేశానని తెలిపింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌‌లో అభిమానులకు తెలిపింది సోనాక్షి. ఈమె కూడా స్టార్ కిడ్ కావడం గమనార్హం. శత్రుఘ్న సిన్హా కూతురు ఈమె. దబంగ్ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ అయిపోయింది సోనాక్షి.

ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేస్తూ.. మీ మనఃశాంతిని కాపాడుకుకోవడానికి మొదట చేయాల్సిన పని నెగిటివిటికీ దూరంగా ఉండటమే.. ఇది ట్విటర్‌ కంటే ఎక్కువ ఇంకెక్కడ ఉండదు.. ఛలో నేను నా అకౌంట్‌ను డీయాక్టివేట్‌ చేస్తున్నాను అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సోనాక్షి. ఇప్పటి వరకు సోనాక్షి 1320 పోస్టులను చేసింది.. ఆమెకు 18.5 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు. మొత్తానికి స్టార్ కిడ్స్ అంతా ఆత్మరక్షణలో పడిపోయారిప్పుడు.