ఆ విషయమై రాజమౌళికి ఫోన్ చేసిన ఆలియా భట్..

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై  ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ అన్ని సినిమాల మాదిరిగానే వాయిదా పడింది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా షూటింగ్‌కు అనుమతులు కూడా ఇచ్చింది. దీంతో డూప్స్‌తో ఆర్ఆర్ఆర్ షూటింగ్ చేద్దామనుకుంటే.. పోలీసుల పర్మిషన్ దొరక్కపోవడంతో ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. ఈ విషయమై చిత్ర యూనిట్‌తో రాజమౌళి ఓసారి భేటీ కూడా అయ్యాడు. మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోన్న ఆలియా భట్ కరోనా కారణంగా ఇంటికే పరిమితమైంది. మరోవైపు దేశ వ్యాప్తంగా ముంబాయిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ సందర్భంగా ఆలియా భట్ రాజమౌళికి ఫోన్ చేసిన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్ వచ్చి షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆలియాభట్.. రాజమౌళికి ఫోన్ చేసి అక్కడున్న పరిస్థితులను వివరించింది. ఈ విషయమై ఏం చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో షూటింగ్ ప్రారంభమై వాయిదా పడితే.. ఎలా అనే విషయమై రాజమౌళి.. ఆలియాభట్ మధ్య సంభాషణ జరిగినట్టు సమాచారం.