బిగ్‌బాస్ హౌస్‌లోకి నలుగురు హాట్ భామలు.. ఇక రచ్చ రచ్చే..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా అన్ని రకాల షూటింగ్స్ రద్దు చేయబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని లాక్‌డౌన్ నుంచి అన్ లాక్ చేసారు. దీంతో ఒక్కో రంగం ప్రభుత్వం సూచించిన మార్గ దర్శకాల ప్రకారం ఓపెన్ అయ్యాయి. ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు షూటింగ్స్‌కు పర్మిషన్ ఇచ్చాయి. ఇప్పటికే కొన్ని టీవీ సీరియల్స్‌తో పాటు జబర్ధస్త్ వంటి ప్రోగ్రామ్స్ వంటివి పట్టాలెక్కాయి. కొన్ని చిన్న చిత్రాలు కూడా షూటింగ్ హడావుడిలో ఉన్నాయి. కానీ పెద్ద హీరోల చిత్రాలు మాత్రం పట్టాలెక్కలేదు. అదే టైమ్‌లో స్టార్ మా వాళ్లు బిగ్‌బాస్ 4 కు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేరేషన్ మొదులపెట్టారు. అన్ని కుదిరితే.. నవంబర్ చివర్లో ఈ రియాల్టీ షో ప్రారంభం కానుంది. అప్పటికే ప్రభుత్వం చెప్పిన నియమ నిబంధనలు పాటిస్తూ.. కరోనా వైరస్ లేదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ షోను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈ షోకు మరింత కలర్ ఫుల్‌గా ఉండడానికి నలుగురు హీరోయిన్స్‌ను రంగంలోకి దింపుతున్నారు. వీళ్లలో ముంబాయి హాట్ గాళ్ శ్రద్దాదాస్‌తో పాటు హీరోయిన్ హంసా నందినితో పాటు మోనా అనే మోడల్‌తో పాటు.. తెలుగమ్మాయి ప్రియా వడ్లమాని, యామిని భాస్కర్ ఈ సారి షోలో తమ గ్లామర్‌తో రచ్చ చేయబోతున్నట్టు సమాచారం. వీళ్లతో పాటు బిత్తిరి సత్తితో పాటు  ఒకప్పటి లవర్ బాయ్ హీరో తరుణ్‌ ఉన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఈయన పేరు మూడో సీజన్‌కు కూడా వినిపించింది. కానీ నాలుగో సీజన్ కోసం వస్తున్నాడని తెలుస్తుంది. ఇక సింగర్ కమ్‌ యాంకర్ మంగ్లీ.. మరో హాట్ యాంకర్ వర్షిణి సౌందర్‌రాజన్‌.. సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్‌ ఈ లిస్ట్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక నాల్గో సీజన్ కోసం హోస్ట్‌గా సమంతతో నాగార్జున పేరు వినిపిస్తోంది. ఫైనల్‌గా బిగ్‌బాస్ 4 సీజన్‌ను ఎవరు హోస్ట్ చేస్తారనేది చూడాలి.