తమన్నా టాక్ షో: మిల్కీ బ్యూటీ షాకింగ్ రెమ్యునరేషన్!!

మిల్కీ బ్యూటీ తమన్నా కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా స్పెషల్ సాంగ్స్‌తోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ‘డాంగ్ డాంగ్’ అంటూ అదిరిపోయే స్టెప్పులతో ఆడియన్స్‌ను అలరించారు. తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు కావస్తున్నా.. ఆమె క్రేజ్ మాత్రం ఇంకా తగ్గలేదు. ప్రస్తుతం తమన్నా ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. మంచి స్క్రిప్ట్‌లు వస్తేనే అంగీకరిస్తున్నారు. అలాగే, తనకు ఇష్టమైన డ్యాన్స్‌ను ప్రదర్శించడానికి స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, ఇప్పటి వరకు వెండితెరపై ప్రేక్షకులను అలరించిన తమన్నా.. ఇప్పుడు బుల్లితెరపై సందడి చేయబోతున్నారట. ఓటీటీలోకి ఆమె అడుగుపెడుతున్నారని సమాచారం. ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ నెలకొల్పిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం తమన్నా ఒక టాక్ షో చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ టాక్ షోలో అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ వంటి స్టార్ హీరోలను తమన్నా ఇంటర్వ్యూ చేయబోతున్నారని తెలిసింది.

ఈ టాక్ షోలో 20 ఎపిసోడ్స్ ఉంటాయని టాక్. అయితే, ఈ టాక్ షో కోసం తమన్నా భారీగా పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఒక్కో ఎపిసోడ్‌కు తమన్నా రూ. 7 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని అంటున్నారు. అంటే, 20 ఎపిసోడ్లకు కలిపి సుమారు కోటిన్నర రెమ్యునరేషన్ తీసుకుంటారని టాక్. ప్రస్తుతం తమన్నా ఒక సినిమాకు తీసుకునే పారితోషికం కన్నా ఈ టాక్ షోకు తీసుకోబోతోన్న రెమ్యునరేషనే అధికమట. ఈ ప్రచారంలో నిజమెంతో తెలీదు కానీ.. దీని వల్ల ఈ టాక్ షో మాత్రం కచ్చితంగా పాపులర్ అవుతుంది.