లస్ట్ స్టోరిస్‌లో తెలుగమ్మాయి.. రొమాంటిక్ సీన్స్‌లో ఇరగదీసిన ఈషా..

తెలుగందం ఈషా రెబ్బా. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఈషా రెబ్బ.. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అవకాశాలను అందిపుచ్చుకోవడంలో సక్సెస్ కాలేకపోతోంది. అందం, టాలెంట్ ఉన్నా అవకాశాలు దొరకడం లేదు ఈ హాట్ బ్యూటీకి. ఆ మధ్య జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత.. వీరరాఘవ’లో అవకాశం వచ్చినా.. ఆ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేకపోవడంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. అయితే టాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్‌ను తన వైపునకు తిప్పుకునేందుకు ఈషా రెబ్బ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ భామ లస్ట్ స్టోరిస్ తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. హిందీలో నలుగురు దర్శకులు ‘లస్ట్ స్టోరీస్’ పేరుతో నెట్ ఫ్లిక్స్ కోసం ఒక వెబ్ సిరీస్ రూపొందించారు. అందులో కియారా అద్వానీ హాట్ సీన్స్ నటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే . ఇక అప్పటినుండి ఈ భామకు హిందీలో ఆఫర్స్ వెల్లువలా వచ్చాయి. ఈ విషయాన్ని కియారా కూడా ఓ సందర్బంలో చెప్పుకొచ్చింది.

కాగా ఇప్పుడు తెలుగులో లవ్ స్టోరీస్ పేరుతో అలాంటి ప్రయోగమే చేస్తోంది నెట్ ఫ్లిక్స్ సంస్థ. ఈ సిరీస్‌లో ఒక ఎపిసోడ్‌లో ఇషా రెబ్బా నటిస్తోంది. ఈ ఎపిసోడ్‌ను ఘాజి దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ స్టోరీలోనే ఇషా రెచ్చిపోతుంది అనేది టాక్. హిందీలో కియారా చేసిన పాత్రనే తెలుగులో ఈషా చేసిందట. అంతేకాదు కొన్ని రొమాంటిక్ సీన్స్‌లో ఈషా అదరగొట్టిందని సమాచారం. మరి ఈ వెబ్ సిరీస్‌తోనైనా ఈ తెలుగు భామకు మంచి గుర్తింపు వస్తుందో లేదో చూడాలి. ఇక ఈ వెబ్ సిరీస్‌లో లవ్ సీన్స్ జోరు ఎక్కువే ఉంటుందట. అందులో భాగంగా ముద్దులు, హగ్గులు లాంటీ సీన్స్ మోతాదును మించి ఉంటాయని టాక్ వినిపిస్తోంది. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో ఉందట. తొందరలోనే మొదటి ఎపిసోడ్ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.