మళ్లీ బాదుడు… గ్యాస్ సిలిండర్ ధర పెంపు.. నేటి నుంచి అమలు…

వంటగ్యాస్ సిలిండర్ ధర నేటి నుంచి పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలకు తగ్గట్టుగా దేశంలో వంటగ్యాస్ రేట్లను క్రమబద్ధీకరిస్తూ … లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) గ్యాస్ ధరను పెంచేశాయి కంపెనీలు. గత నెలలో ఇలాగే ధర పెంచిన కంపెనీలు… మళ్లీ జులై రాగానే మరోసారి పెంచేశాయి. ఇండియన్ ఆయిల్‌ కంపెనీకి చెందిన 14.2 కేజీల సిలిండర్ (సబ్సిడీ కానిది) ఇండేన్… ఇప్పుడు… ఢిల్లీ, ముంబైలో రూ.594 రూపాయలు అయ్యింది. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1 పెరగగా… ముంబైలో రూ.3.5 పెరిగింది. గత నెల్లో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్‌పై ధరను రూ.11.50 పెంచారు. అంతకుముందు వరుసగా మూడు నెలలపాటూ ధర తగ్గించడంతో… అప్పట్లో బండ ధర రూ.277కే లభించింది. ఫిబ్రవరిలో ధర ఏకంగా రూ.858కి పెరిగింది. మార్చి, ఏప్రిల్, మేలో… కరోనా వల్ల ధర తగ్గించడంతో రూ.581కి చేరింది రేటు. ఇప్పుడు ఏకంగా రూ.594కి చేరింది.

ఇక హైదరాబాద్‌లో జూన్‌లో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.641గా ఉండగా… ఇప్పుడు అది రూ.4.5 పెరిగి… రూ.645.50 అయ్యింది.

తాజాగా ఇండేన్ గ్యాస్ సబ్సిడీయేతర బండ ఏ రాష్ట్రాల్లో ఎంత రేటంటే…
హైదరాబాద్ – రూ.645.50
ఢిల్లీ – రూ.594
కోల్‌కతా – రూ.620.50
ముంబై – రూ.594చెన్నై – రూ.610.50

సబ్సిడీ ప్రకారం ఏడాదికి 12 సిలిండర్లు సబ్సిడీతో ఇస్తున్నా్రు. అంతకంటే ఎక్కువ కావాలంటే… మార్కెట్ రేటు ప్రకారం కొనుక్కోవాల్సిందే.