గోల్డెన్ కాఫీ కప్పులు, బాత్‌టబ్బులు… ప్రపంచంలోనే తొలి బంగారు హోటల్‌…

వియత్నాంలో నిర్మిస్తున్న ఓ హోటల్ ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కరోనా వల్ల హోటల్ రంగం పడిపోతున్న సమయంలో… అక్కడ మాత్రం బంగారం తాపడంతో… హోటల్‌ని నిర్మిస్తున్నారు. అదే… హనోయ్ సిటీలోని డోల్స్ హనోయ్ గోల్డెన్ లేక హోటల్.

దుబాయిలోని బుర్జ్‌ అల్‌-అరబ్‌ హోటల్‌లోని ఎలివేటర్‌, లాబీని బంగారం పూతతో ఏర్పాటు చేశారు. యూఏఈలోని ఎమిరేట్స్‌ ప్యాలెస్‌లో సీలింగ్‌, గోడలకు బంగారం పూత వేశారు. లాస్‌ వెగాస్‌లోని ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ హోటల్‌లో కిటికీలు కూడా బంగారంపూతతో నిర్మించారు. ఈ హోటల్ వాటన్నింటికంటే ఆకర్షణీయంగా మారింది.